చేసి చూపిస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ శ్రుతిహాసన్ నటిగా పేరు తెచ్చుకుంటూ ముందుకు వెళుతున్నారు. మలయాళం ‘ప్రేమమ్’ సినిమాలో సాయి పల్లవి పోషించిన మలర్ పాత్రకు తనని ఎంపిక చేసినపుడు అందరూ పెదవి విరిచారు. కానీ ఇటీవల ‘ప్రేమమ్’ ఫస్ట్‌లుక్‌లో ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. లెక్చరర్ పాత్రలో తనని తాను మలుచుకున్న విధానానికి అందరూ ఫిదా అయ్యారు. ఇది ఎలా సాధ్యపడిందన్న ప్రశ్నకు శ్రుతిహాసన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. చిన్నప్పట్నుంచి కూడా సాహసాలు చేయడం అలవాటని, ఎవరైనా ఇది చేయలేవు అంటే చేసి చూపించేదాకా నిద్రపోయేదాన్ని కాదని, అది చేసేవరకు ఎంతైనా కష్టపడేదాన్నని గుర్తుచేసింది. సినిమా పరిశ్రమలోకి వచ్చాక కూడా తీరు మారలేదని, అవసరమనుకొంటే కఠోరంగా శ్రమించైనా చేయాలనుకొన్నది చేసి తీరతా తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ప్రతిక్షణం సవాల్ విసిరే పాత్రలకోసం అనే్వషిస్తుంటా అని చెప్పుకొచ్చింది శ్రుతిహాసన్. ఆమె ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో ‘ప్రేమమ్’తోపాటు సూర్యతో కలిసి ‘సింగం-3’లో నటిస్తోంది.