పేదలకోసం మేము సైతం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజంలో అనారోగ్య, ఆర్థిక సమస్యలతో తల్లడిల్లుతున్న కుటుంబాలని ప్రత్యేక శ్రద్ధతో గుర్తించి వారిని ఆదుకోవడానికి తమ వంతు బాధ్యతగా ‘మేము సైతం’ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, వెండితెరమీద మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా మన స్టార్స్ తమ ప్రత్యేకతను చాటబోతున్నారని మంచు లక్ష్మి వెల్లడించారు. ఆమె ఆధ్వర్యంలో వస్తోన్న ‘మేము సైతం’ కార్యక్రమం ఏప్రిల్ 2 నుండి ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు ఒక ప్రైవేట్ చానల్‌లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ, రెండు సంవత్సరాలుగా ఇలాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలోచిస్తున్నానని అన్నారు. కానీ ఎలా ఫార్మాట్ చేయాలో అర్థం కాలేదని, సుశీల్‌కుమార్ షిండే కుమార్తె స్మృతి షిండే ఇలాంటి కార్యక్రమాన్ని హిందీలో చేస్తున్నారని తెలిసిందని చెప్పారు. దక్షిణాదిన కూడా చేయాలని ఆమె నన్ను అడిగిన వెంటనే అంగీకరించానని, జీవితంలో మరొకదారి లేని నిరాశ చెందే వారికి ఒక మార్గం చూపించడమనేదే మంచి విషయమని, దీనికి సహకరిస్తున్న మన నటీనటులందరికీ కృతజ్ఞతలని లక్ష్మి చెప్పారు. టీవీ షోలో ఇదొక బాహుబలి అని చెప్పొచ్చు. దీనికోసం అంతా ఎఫర్ట్ పెడుతున్నాం. తమిళం, మలయాళం, కన్నడలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్లాన్ చేస్తున్నామని అన్నారు. పదేళ్ల చిన్న పాప క్యాన్సర్‌తో వ్యాధితో బాధపడుతోంది, తన జీవితంలో మార్పు రావడం కోసం నేను కాయగూరలు అమ్మాను అంటూ రకుల్ ప్రీత్‌సింగ్ ఈ సందర్భంగా చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో జెమిని సుబ్రహ్మణ్యం, కాశీనాథ్, జెమిని కిరణ్ పాల్గొన్నారు.