సిద్ధమైన గుమ్మడిపండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివకృతి క్రియేషన్స్ పతాకంపై ఎం.వి.సాగర్ దర్శకత్వంలో కెల్లం కిరణ్‌కుమార్ రూపొందించిన చిత్రం ‘వీరి వీరి గుమ్మడిపండు’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి తొలి కాపీ సిద్ధం చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఫ్యామిలీ హారర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో 63మంది కొత్త వాళ్లతోపాటుగా ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా నటించారని, రుద్ర అనే హీరోని ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నామని తెలిపారు. హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం తప్పక నచ్చుతుందని ఆయన తెలిపారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.
సినిమా అంటే ఉన్న ప్యాషన్‌తో ఈ సినిమాను డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దామని, కథను నమ్మి రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందని, త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. రుద్ర, వెనె్నల, సంజయ్, బంగారం, రుషి శే్వత, హార్దికేష్, రుషిత, రఘుబాబు, శివన్నారాయణ, దీక్షిత్, అనంత్, ప్రవీణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: శక్తిస్వరూప్, సంగీతం: పి.ఆర్, కెమెరా: కె.ఎం.కృష్ణ, నిర్మాత: కెల్లం కిరణ్‌కుమార్, దర్శకత్వం: ఎం.వి.సాగర్.