సోలోగానే ముందుకెళ్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మంచు, దినేష్ తేజ్, దక్ష నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం ‘హుషారు’. ఈ సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా యువ హీరో తేజస్ కంచర్ల మీడియాతో మాట్లాడుతూ సినిమా విడుదల విషయంలో హుషారుకన్నా ఎగ్జయిట్‌మెంట్, టెన్షన్ ఎక్కువగా ఉందన్నాడు. నాలుగేళ్ల క్రితం వచ్చిన ఉలవచారు బిర్యానీ తర్వాత నేను వేసిన రాంగ్ స్టెప్ కేటుగాడు. ఆ దెబ్బతో ఇక ధైర్యం చేయలేకపోయా. ఈసారి సరైన ప్రణాళికతోనే వస్తున్నా. నలుగురు ముఖ్య పాత్రలు చేస్తున్నా, నాది మెయిన్ లీడ్ కాబట్టి సినిమా చేశా. ఫ్రెండ్‌షిప్ వాల్యూని తెలిపే కథ ఇది. దీని తర్వాత పెద్ద బ్యానర్‌లో ఒక సినిమా ఉంది. ఇంకా కథ ఫైనల్ కాలేదు. అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలోనూ ఓ సినిమా ఉంది అన్నాడు.