పోలీసోడు విజయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తుపాకి’ సినిమా ద్వారా టాలీవుడ్‌లో మంచి మార్కెట్‌ను సొంతం చేసుకున్నాడు విజయ్. తమిళనాడులో రజనీకాంత్ తరువాత అంతమంది అభిమానులున్న విజయ్, ఈసారి ఎలాగైనా తెలుగు మార్కెట్ దక్కించుకోవాలనే సన్నాహాలు చేస్తున్నారు. ఆయన హీరోగా నటించిన ‘తేరీ’ సినిమా ట్రైలర్ ఇప్పటికే తమిళంలో మంచి రెస్పాన్స్ పొందింది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 14న భారీ స్థాయిలో తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తేరీ తెలుగు వెర్షన్‌కు ‘పోలీసోడు’ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఇటీవల విన్నర్ అనే పేరును కూడా పరిశీలిస్తున్నట్లు వినిపించింది. గతంలో రాజారాణి అనే ప్రేమకథా చిత్రానికి దర్శకత్వం వహించిన అట్లీ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించారు.