సరైనోడు పాటల విందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సరైనోడు’. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలని శుక్రువారంనాడు డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఆడియో విడుదలైన క్షణంనుండి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అనూహ్యమైన స్పందన వస్తోందని తెలిసింది. ఇప్పటికే విడుదలైన వీడియో సాంగ్ సంచలనం క్రియేట్ చేస్తోంది. ఈనెల 10న ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను వైజాగ్‌లో భారీ స్థాయిలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మెగా అభిమానులు భారీగా పాల్గొనే ఈ వేడుకకు దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చుచేస్తున్నారట. అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరిన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది.