లక్కీ జిలేబీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది ‘విజేత’నంటూ హీరో ఎంట్రీ ఇచ్చినా, ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న కళ్యాణ్‌దేవ్ ఇప్పుడు పులి వాస దర్శకత్వంలో రెండో సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. కళ్యాణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తిని హీరోయిన్‌గా ఫైనలైజ్ చేశారట. హిందీలో హాఫ్ గర్ల్ ఫ్రెండ్, బ్యాంక్ చోర్, జలేబిలాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులోనూ ‘తూనీగా తూనీగా’ సినిమా చేసింది. ‘జిలేబీ’లో హీరోకిచ్చిన జిమ్నాస్టిక్ కిస్సులు ఆమెకు గుర్తింపు తెచ్చాయి. ఇప్పుడు కళ్యాణ్‌దేవ్ సినిమా ద్వారా మెగా కాంపౌండ్‌లోకి ఎంట్రీ ఇస్తే మంచి బ్రేక్ దొరకడం ఖాయమే. రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తారట. సినిమాకు థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ సైతం పూరె్తైనట్టు చెబుతున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగున్నాయని సమాచారం.