నాన్న కోసమే చేశా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్‌చరణ్. ఇప్పుడు -చరణ్ ఫాదర్ చిరంజీవి. ఇంతకుమించి అతనిగురించి ఎక్కువ చెప్పగలిగేదేమీ ఉండకపోవచ్చు. మెగా ఫ్యామిలీ ముద్రతో ఇండస్ట్రీకి వచ్చినా -ఆ బ్రాండ్‌ను భుజస్కందాలపై మోయగల స్టార్‌గా ఎదిగాడు. గత ఏడాది సుకుమార్‌తో చేసిన రంగస్థలం ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ అయ్యింది. హీరోగా తన రేంజ్ పెంచుతూనే, నిర్మాతగానూ తనదైన స్టయిల్ చూపిస్తున్నాడు చరణ్. ‘నాన్నకు నచ్చిన కథల్ని బడ్జెట్ పరిమితులు లేకుండా తెరకెక్కించడానికే నిర్మాత అవతారం ఎత్తాను అందుకే బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయంచాన’న్నది చరణ్ మాట. తాజాగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో క్లాసిక్ టైటిల్ ‘వినయ విధేయ రామ’గా వస్తున్న చరణ్
-సంక్రాంతికి నా షేర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయం అంటున్నాడు. సీత (కైరా అద్వానీ)ను తీసుకుని 11న థియేటర్లకు వస్తున్న సందర్భంగా చరణ్‌తో చిట్‌చాట్.

మార్పు కనిపిస్తోంది. టీమ్‌ని బాగా చూస్తున్నారట..:
ఎలాంటి మార్పు. నేనెప్పుడూ ఒకేలా ఉంటా. మార్పు -ఎదుటివ్యక్తి చూసే పరిస్థితిని బట్టి ఉంటుందేమో. నేను సైరా సినిమాకు నిర్మాతను. టీమ్ బాగునే కోరతా. అందుకోసం వారికి ఆర్థికంగా సహాయపడుతుంటా. ఖైదీ నెంబర్ 150 టైంలోనూ అలాగే ఉన్నా. టీంను హ్యాపీగా చూస్తే, సినిమాకు ఉత్సాహంగా పని చేస్తారు. నాతోవుండే పర్సనల్ టీమ్ కూడా ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు.

రంగస్థలం తరువాత..:
నటుడిగా ఒకదానికే పరిమితం కాకుండా అన్ని జోనర్లూ టచ్ చేయాలన్నదే నా ఉద్దేశం. 80వ దశకంలో నాన్న చేసిందీ అదే. కాకపోతే, ఈసారి జోనర్‌కంటే సెన్సిబుల్ సినిమా గురించి ఆలోచించా. అలా ఒప్పుకున్నదే -వినయ విధేయ రామ.
కథలో నచ్చిన అంశం:
నలుగురు అన్నదమ్ముల కథ. వారి కుటుంబంలో తలెత్తిన సంఘటనలే ఇతివృత్తం. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో రామ్ పాత్రలో కనిపిస్తా. కొడుకో, తమ్ముడో, మరిదో.. ఇలా ప్రతి ఇంట్లో ఇలాంటి వాడొకడుండాలి అనిపించే పాత్ర. అయోధ్య రాముడన్న మాట. వినయంగా ఉంటూనే, అవసరమైతై విధ్వంసం సృష్టించే క్యారెక్టరైజేషన్.
బోయపాటి అంటేనే లోడెడ్ యాక్షన్..:
ఈ సినిమాకు అంత టైం దొరకలేదు. మరికొంత టైముంటే బాగుండేది అనిపించింది. రంగస్థలం షూట్ అయిపోయిన 25 రోజుల గ్యాప్‌లో ఈ షూట్ మొదలుపెట్టాం. బోయపాటికి, నాకూ వేరే కమిట్‌మెంట్స్ ఉండటంతో తొందరపడాల్సి వచ్చింది. అయితే దర్శకుడు క్లారిటీగా ఉండటంతో, ఈ పాత్ర నాకు సులువైంది. కొంచెం టైముంటే ఇంకా బావుండేది.
రంగస్థలం ఇంపాక్ట్ దీనిపై...:
రంగస్థలంతో పోల్చడం సరికాదు. ఏ ప్రాజెక్టునైనా మంచి సినిమా కావాలనే ప్రయత్నిస్తాం. అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది చెప్పలేంగా.
గ్యాంగ్‌లీడర్‌తో పోలిక:
అస్సలుండదు. గ్యాంగ్ లీడర్ సినిమా చేయాలన ఆలోచన ఇంతకుముందొకసారి వ్యక్తం చేశా. అందుకే ఈ సినిమాతో పోల్చుకుంటున్నారేమో.
రాజవౌళి ప్రాజెక్టులో మీ పాత్ర:
రాజవౌళి మళ్లీ డీ గ్లామరైజ్డ్ పాత్ర సృష్టించాడు. సాధారణ యువకుడిలానే కనిపిస్తా. కాని ప్రేక్షకులకు బాగా కనెక్టవుతుంది. సినిమా కోసం ఆసక్తిగానే ఎదురుచూస్తున్నా. ఏడాది మొత్తం ఈ సినిమాకే కేటాయించాను.
ఎన్టీఆర్‌తో మీ కాంబినేషన్..:
ఎన్టీఆర్ నాకు మంచి స్నేహితుడు. అదీ, చాలాకాలంగా. మా ఇద్దరి కాంబినేషన్ సన్నివేశాలు బాగా వస్తున్నాయి. ఎన్టీఆర్‌తో కలిసి వర్క్ చేయడం మంచి అనుభూతి.
సైరా ఎంతవరకు వచ్చింది..:
రెండు నెలల్లో షూటింగ్ పూర్తవుతుంది. మంచి డేట్ చూసి సమ్మర్‌లో విడుదలకు ప్లాన్ చేస్తాం.
స్టార్ హీరో.. నిర్మాత.. రిస్క్ కాదూ?
రిస్టేననిపిస్తుంది ఒక్కోసారి. కానీ నచ్చిన పని కదా. ప్లానింగ్‌తో చేసుకుపోతున్నా.
మీ బ్యానర్‌లో వేరే హీరోలతో..:
లేదండి. కేవలం నాన్న సినిమాల కోసమే ఇది. నా సినిమాలు కూడా చేస్తానేమో. బట్, నాకు మంచి నిర్మాతలున్నారు. ప్రస్తుతానికైతే వేరే హీరోలతో ఈ బ్యానర్‌లో సినిమాలు చేసే ఆలోచన లేదు.
మెగాస్టార్ చిరంజీవికి
బయట పెద్ద బ్యానర్లు ఉన్నాయిగా..:
కొన్ని నచ్చిన కథలు చేయాలంటే బయటి బ్యానర్లు బడ్జెట్ విషయంలో రిస్క్ చేయకపోవచ్చు. అందుకే మనకునచ్చిన సినిమాలు చేయడానికే ఈ బ్యానర్.
చిరుకి రెమ్యునరేషన్ ఇస్తున్నారా:
తెలుగులో ఏ నిర్మాతా ఇవ్వనంత ఇస్తున్నా. కావాలంటే నాన్ననే అడగండి.
హిందీ సినిమా ఎప్పుడు?
ఇక్కడ బాగానే ఉందిగా. హిందీ ఎందుకు?
భారీ బడ్జెట్‌తో వెళ్తున్నారు. రిస్క్ కాదా?
పెట్టింది వెనక్కి వచ్చేంత వరకూ రిస్క్ కాదు.
తరువాతి ప్రాజెక్టు..:
ప్రస్తుతం రాజవౌళి సినిమా ఉంది. తరువాత కొరటాల శివతో సినిమా ఉంటుంది. అదీ నాన్న- కొరటాల శివ సినిమా అయ్యాక, నేను చేస్తా.

-శ్రీనివాస్ ఆర్ రావ్