తెలుగులో హేమమాలిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడెప్పుడో ‘పాండవ వనవాసం’, ‘శ్రీకృష్ణవిజయం’ చిత్రాలలో తన డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ డ్రీమ్‌గాళ్ తెలుగులో మళ్లీ ఓసారి కనిపించనున్నది. విషయంలోకెళితే బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తన వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రంలో రాజమాతగా హేమామాలిని నటించనున్నదని టాలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఆ పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేకూర్చగలదని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ప్రస్తుతం విదేశాల్లో వున్న హేమామాలిని తిరిగిరాగానే ఆమెను సంప్రదించనున్నారు. ఉగాదిన ప్రారంభం కానున్న ఈ చిత్రంలో ఆమె నటించనున్నదీలేనిదీ తేలిపోతుంది. సో ఈ చిత్రంలో గనక హేమామాలిని నటిస్తే ఆమె తెలుగులో నటించే మూడో చిత్రం అవుతుంది.