గజినికి సీక్వెల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్య హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘గజిని’ సినిమా భారీ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. తెలుగులో డబ్ అయ్యి ఇక్కడ కూడా సూపర్‌హిట్ అయ్యింది. అల్లు అరవింద్ ఈ సినిమాను తెలుగులో డబ్ చేశాడు. టాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన గజినిని బాలీవుడ్‌లో అల్లు అరవింద్ అదే మురుగదాస్ దర్శకత్వంలో రీమేక్ చేసిన విషయం తెల్సిందే. బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్ నటించిన గజిని అక్కడ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పట్లో 100 కోట్లు రాబట్టింది. మురుగదాస్‌కు బాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ హోదాను తెచ్చిపెట్టింది. అల్లు అరవింద్‌కు భారీగా లాభాలను తెచ్చిపెట్టిన గజిని సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఫిల్మ్ ఛాంబర్‌లో గజిని 2 అంటూ టైటిల్ రిజిస్టర్ అయ్యింది. అది మరెవ్వరో రిజిస్టర్ చేయిస్తే పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. కానీ స్వయంగా అల్లు అరవింద్ ఆ టైటిల్‌ను రిజిస్టర్ తన గీత ఆర్ట్స్‌లో చేయించాడు. అందుకే త్వరలోనే గజిని 2 సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే గజిని సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా ఉంటుందా లేదంటే కొత్త కథతో సినిమాను తీస్తారా అనేది చూడాలి. గజిని 2కు మురుగదాస్ దర్శకత్వం వహిస్తాడా లేదా అనే విషయం కూడా తెలియాలి.