సరిహద్దులో తనీష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషికి, మనిషికి... దేశాలకు, ప్రాంతాలకు మధ్య కొన్ని హద్దులు ఉంటాయి. ఎవరి పరిధిలో వాళ్లున్నంతవరకూ అవి సరిగానే ఉంటాయి. కానీ ఒక్కసారి ఆ సరిహద్దులు అతిక్రమిస్తే సంఘర్షణ మొదలవుతుంది. దేశాలు, ప్రాంతాల మధ్య ఈ సరిహద్దు సంఘర్షణలు తీవ్ర పరిణామాలకు దారితీయొచ్చు. ఒక్కోసారి అది జాతీయ సమస్యగానూ మారొచ్చు. అలా మారకుండా చూసే శక్తి ఆర్మీ. సైనికుడు సరిహద్దుకు కాదు దేశానికే రక్షకుడు. ఇదే కానె్సప్ట్‌తో యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తనీష్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. తనీష్ గత సినిమా రంగుతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న కార్తికేయ ఈ చిత్రానికి దర్శకుడు. అంటే రంగు కాంబినేషన్ రిపీట్ అవుతోందన్నమాట. నేషనలైజ్డ్ కానె్సప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం టైటిల్ కూడా ‘సరిహద్దు’. ఈ సందర్భంగా దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ.. భాషను నేర్చుకొని జ్ఞానాన్ని సంపాదించాలనుకొని.. ప్రతి భాషకు ఒక ‘తెగ’’అనీ.. కొన్ని తెగలకు ఒక ‘కులం’ అనీ.. కొన్ని కులాలు కలసి ఒక ‘మతం’అనీ విడిపోతూ మృగాలనుండి మనుషులుగా.. మనుషులనుండి ‘తెగలుగా’..తెగలనుండి .. ‘కులాలు’... కులాలనుండి ‘మతాలుగా’’ మతాల నుండి ‘రాష్ట్రాలుగా’ రాష్ట్రాలనుంచి ‘దేశాలుగా’.. సరిహద్దుల్ని గీసుకొంటూ.. బతుకుతున్నాం. ఈ కానె్సప్ట్‌తో సరిహద్దు రూపొందబోతుంది’ అన్నారు. దర్శకుడు కార్తికేయ, హీరో తనీష్ ‘రంగు’ సినిమాతో అద్భుతమైన ప్రశంసలు అందుకున్నారు. అందుకే మరోసారి వీరి కాంబినేషన్‌లో సినిమాకు రంగం సిద్ధమైంది. ఈసారి అంచనాలు కూడా ఉంటాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా ఓ అద్భుతమైన కథతోనే మళ్లీ వస్తున్నారు ఈ ఇద్దరు. తెలుగుతోపాటు హిందీ భాషలోనూ విడుదల చేయబోతోన్న ‘సరిహద్దు’ మూవీ షూటింగ్ మార్చి 16నుంచి ప్రారంభం కాబోతోంది.
టెక్నికల్‌గా హైస్టాండర్డ్స్‌లో ఉండబోతోన్న ఈ చిత్రంలో తెలుగుతోపాటు హిందీ భాషా నటులు కూడా నటిస్తారు. ప్రస్తుతం టైటిల్‌తోనే విపరీతంగా ఆకట్టుకుంటోన్న ఈ టీమ్.. సినిమాకు సంబంధించిన వివరాలతోపాటు ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కు సంబంధించిన వివరాలను ఈనెలాఖరులో తెలియజేయబోతున్నారు.