మళ్లీ చిరుతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవికి హీరోయిన్ సెట్టైపోయింది. ప్రస్తుతం సైరా షూటింగ్‌లో బిజీగావున్న చిరు, తరువాతి ప్రాజెక్టుకూ ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. టాప్ డైరెక్టర్ కొరటాలతో ప్రాజెక్టు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో -హీరోయిన్‌గా మళ్లీ నయన్‌కే అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి సీనియర్ హీరోల సరసన చాలా తక్కువ చిత్రాలను ఒప్పుకునే నయన్, కుర్ర హీరోల ప్రాజెక్టులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చేది. అలాంటి టైంలో ఫస్ట్‌టైమ్ మెగాస్టార్‌తో ‘సైరా’లో జోడీకట్టింది. చిరంజీవి ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేయగల సీనియర్ హీరోయిన్‌గా నయన్‌కే కొరటాల టీం ఎక్కువ మార్కులు వేసినట్టు తెలుస్తోంది. అంతకుముందు ఖైదీ నెంబర్ 150లో చిరుతో జోడీ కట్టిన కాజల్‌ను లీడ్‌రోల్‌కు అనుకున్నా, తరువాత అనుష్క, శ్రీయ, త్రిషల పేర్లూ పరిశీలనకు వచ్చాయి. ఒకింత ఇమేజ్‌తో కంటిన్యూ అవుతున్న సీనియర్ హీరోయిన్లు చాలా తక్కువ ఉండటంతో, ఉన్నవాళ్లనుంచే చిరుకు జోడీని వెతకాల్సి వచ్చింది. బాలీవుడ్ భామ ఎవరైనా చిరుతో జోడీ కట్టే అవకాశాలూ లేకపోలేదంటూ కథనాలు వినిపించినా -కొరటాల టీం ఆసక్తి చూపించినట్టు కనిపించలేదు. సో, సైరాలో చిరుకు సమవుజ్జీ అనిపించుకున్న నయనతారనే తరువాతి ప్రాజెక్టుకూ తీసుకోవాలని కొరటాల ఆలోచిస్తున్నట్టు టాక్. సీనియర్ హీరోయిన్‌గా దక్షిణాదిన ఆమెకున్న ఇమేజ్‌నూ పరిగణనలోకి తీసుకుని -ఆమెతో సంప్రతింపులు జరుపుతున్నట్టు ఇండస్ట్రీ సమాచారం.