నీడే వెంటాడితే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి శత్రువుతో యుద్ధం చేస్తే గెలుస్తాడు. కానీ తన నీడతోనే యుద్ధం చేయాల్సివస్తే.. అలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న యువకుడు ఎలా బయటపడ్డాడు. ఎలా సక్సెస్ అయ్యాడు అనేది తెలుసుకోవాలంటే ‘నిను వీడని నీడను నేనే’ చూడాల్సిందే అంటున్నారు యువ కథానాయకుడు సందీప్ కిషన్. ఇదొక ఎమోషనల్ హారర్ ఎంటర్‌టైనర్. ఇప్పటివరకు ఎవరూ టచ్‌చేయని కథాంశంతో రాబోతోంది. వెంకటాద్రి టాకీస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై కార్తిక్‌రాజు దర్శకత్వంలో దయా పనె్నం, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలుగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. ఎస్.ఎస్.తమన్ సంగీత సారధ్యం వహిస్తున్నారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్‌రాజు మాట్లాడుతూ ‘కొత్త పాయింట్ తీసుకుని ఎమోషనల్ హారర్ ఎంటర్‌టైనర్ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో, హైటెక్నికల్ వేల్యూస్‌తో రూపొందిస్తున్నాం. సందీప్ కిషన్ తొలిసారి నటిస్తోన్న హారర్ చిత్రమిది. ఫైనల్ షెడ్యూల్‌ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నాం. హీరోహీరోయిన్‌ల పై కొన్ని కీలక సన్నివేశాలు, ఒక ముఖ్యమైన పోరాట సన్నివేశం చిత్రీకరించటంతో సినిమా పూర్తవుతుంది’ అన్నారు. నిర్మాత దయా పనె్నం మాట్లాడుతూ ‘దర్శకుడు కార్తీక్ సినిమాను అనుకున్న ప్లానింగ్ ప్రకారం పూర్తిచేస్తున్నారు. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు.