మెగానుంచి మరో హీరో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్న చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, నాగబాబు, అల్లు అర్జున్, వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మెగాహీరో సాయిధరమ్ తేజ్ తల్లిదండ్రులు శివప్రసాద్, విజయదుర్గ, చిరంజీవి తల్లి అంజనాదేవి, నిహారిక కార్యక్రమానికి హాజరయ్యారు. చిరంజీవి క్లాప్ కొట్టి షూటింగ్‌ని ప్రారంభించగా, అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నాగబాబు, అల్లు అర్జున్ స్క్రిప్ట్‌ని అందజేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న చిత్రం మార్చి మొదటివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ మైత్రి మూవీస్ సంస్థ గురించి, సాధించిన విజయాల గురించి అందరికీ తెలిసిందే. మంచి మనసున్న వ్యక్తులు నిర్మాతలు. వీరితో సుకుమార్ కలిసి వైష్ణవ్ తేజ్‌తో సినిమా తీయబోతున్నారు. సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ బుచ్చిబాబు కొత్త కథ రాశాడు. తాను మాత్రమే ఎదగాలని కాకుండా తనతోపాటు ఇతరులూ ఎదగాలని సుకుమార్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.
దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ మైత్రి మూవీస్‌తో కలిసి నా అసోసియేట్ బుచ్చిబాబు సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. ఈ కథతో పెద్ద దర్శకుడవుతాడని ఖచ్చితంగా చెప్పగలను. వైష్ణవ్ కోసమే ఈ కథ పుట్టింది. ఈ ప్రాజెక్టు ఇంత దూరం రావడానికి కారణం కథే. చాలామంది టెస్ట్ చేసి మనీషా అనే తెలుగమ్మాయిని హీరోయిన్‌గా సెలక్ట్ చేశాం. ఈ సినిమా హిట్‌తో వైష్ణవ్‌కి మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నానన్నారు. నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మెగాస్టార్ చిరంజీవికి, అల్లు అర్జున్‌కు, వరుణ్‌తేజ్‌కి, సాయిధరమ్‌కు ధన్యవాదాలన్నారు. దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ సుకుమార్‌కి కృతజ్ఞతలు చెప్పుకున్నా సరిపోదు. నామీద నమ్మకముంచిన చిరంజీవికి, అమ్మా నాన్నలకు థాంక్స్. మైత్రీ మూవీ మేకర్స్ ఇచ్చిన సపోర్టుతో మంచి సినిమా తీస్తానన్నారు.