చెన్నయ్‌లో రోబో 2.0

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్ స్టార్ రజనీకాంత్, సంచలన దర్శకుడు శంకర్ కలయికలో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతూన్న రోబో 2.0 చిత్రం ఇటీవల ఢిల్లీలోని నెహ్రూ స్టేడియంలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకున్న విషయం తెలిసిందే. రజనీ, అక్షయ్‌కుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. మరో షెడ్యూల్‌ను మొరాకోలో చిత్రీకరించాలని అనుకున్నా, ఎండలు తీవ్రంగా ఉండడంతో ఈ షెడ్యూల్‌ని చెన్నయ్‌కి మార్చారు. కళా దర్శకుడు ముత్తురాజ్ ఆధ్వర్యంలో చెన్నయ్‌లోని విజిపి సిటీ దగ్గరలో భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. మే నుంచి అందులోనే షూటింగ్ జరుపుతారట. రజనీ సరసన అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తుండగా అత్యంత భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.