శర్వా సెట్టైనట్టే..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్ రాజు తెరకెక్కించనున్న తమిళ రీమక్ చిత్రం ‘96’కు హీరో హీరోయిన్లు ఫిక్సయినట్టేనన్న వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. తమిళ వర్షన్‌లో విజయ్ సేతుపతి, త్రిషలు కాంబినేషన్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో, తెలుగులోనూ చిత్రమైన కాంబినేషన్‌కు ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఆ రెండు పాత్రలను శర్వానంద్, సమంత పోషించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. విజయ్ సేతుపతి పాత్రకు సంబంధించి ఇప్పటికే అనేకమంది హీరోల పేర్లు వినిపించినా, చివరకు నాని ఆ పాత్రలో కనిపించొచ్చన్న అంచనాలు వినిపించాయి. చివరకు అల్లు అర్జున్, త్రిష పేర్లూ వినిపించాయి. అయితే, వాటన్నిటినీ కొట్టిపారేసిన దిల్ రాజు, తాజాగా శర్వానంద్, సమంత కాంబోకోసం ట్రై చేస్తున్నట్టు సమాచారం. మాతృకను డిజైన్ చేసిన సి ప్రేమ్‌కుమార్ రీమేక్‌నూ తెరకెక్కిస్తున్నప్పటికీ, ఇక్కడి వాతావరణానికి అనుకూలంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ప్రధాన పాత్రలమధ్య సాగిన కళాశాల ప్రేమను వైవిధ్యంగా చూపించేందుకు దర్శకుడు స్క్రిప్ట్‌కు పదును పెడుతున్నట్టు సమాచారం. మార్చినుంచి సెట్స్‌మీదకు వెళ్తారని, ఆగస్టులోనే చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. అధికారికంగా వివరాలు ప్రకటించాల్సి ఉంది.