Others

కొంచెం కష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అర్జున్‌రెడ్డి’ చిత్రాన్ని బాలీవుడ్‌లో ‘కబీర్‌సింగ్’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ పోషించిన అర్జున్‌రెడ్డి పాత్రను బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్‌కపూర్ పోషిస్తుంటే, షాలిని పాండే పోషించిన ప్రీతి పాత్రను హాట్ బ్యూటీ కైరా అద్వానీ పోషిస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న చిత్రానికి ఒరిజినల్ వర్షన్ డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు అల్ట్రా మోడ్రన్ లుక్‌లో హాట్‌గా కనిపించిన ముద్దుగుమ్మ కైరా అద్వానీ, మొదటిసారి ఈ సినిమా కోసం కామ్ గోయింగ్ పాత్ర పోషిస్తోంది. అర్జున్‌రెడ్డిలోని ప్రీతి పాత్ర చాలా సైలెంట్‌గా, ఓపికతో ఉంటుంది. ప్రీతి పాత్రను ‘కబీర్‌సింగ్’లోనూ అచ్చం అలాగే డిజైన్ చేశారు. దీనిపై హీరోయిన్ కైరా అద్వానీ మాట్లాడుతూ -నిజ జీవితంలో చాలా అల్లరి చేస్తూ ఎప్పుడు ఏదోకటి మాట్లాడుతుంటాను. కాని సినిమాలో మాత్రం పూర్తి అపోజిట్ పాత్ర చేస్తున్నా’నంటూ చెప్పుకొచ్చింది. నేను ఔట్ స్పోకెన్ కాని ప్రీతి మాత్రం చాలా సైలెంట్. నాలాంటి అమ్మాయి ఆ పాత్రలో నటించడం కాస్త ఇబ్బందే. తెలుగులో ఈ అమ్మడు భరత్ అనే నేను చిత్రంతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాని వినయ విధేయ రామ చిత్రంతో కైరా అద్వానీ పరిస్థితి రివర్సైంది.