రాజుగారింట్లో పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజయ్, భరత్, అర్జున్, వెంకటేష్, సుశ్మిత ప్రధాన పాత్రల్లో ఫిరోజ్‌రాజా దర్శకత్వంలో భరత్ ఫిలిమ్ ఫ్యాక్టరీ పతాకంపై భరత్‌కుమార్ పీలం నిర్మిస్తున్న చిత్రం ‘రాజుగారింట్లో 7వ రోజు’. కనిష్క్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సీడీని ఆవిష్కరించి, తొలి సీడీని హీరో తరుణ్‌కు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ట్రైలర్ బాగుంది. ఈమధ్య కాలంలో హారర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అదే నేపధ్యంతో వస్తున్న ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలి అన్నారు. హీరో తరుణ్ మాట్లాడుతూ.. ఓ రాజుగారి గది సినిమా కంటే ఈ చిత్రం ఏడురెట్లు పెద్ద విజయాన్ని సాధించాలి. కనిష్క్ మంచి సంగీతాన్ని అందించాడు అన్నారు. దర్శకుడు ఫిరోజ్‌రాజ మాట్లాడుతూ.. అందరి జీవితాల్లో జరిగే సంఘటనలే ఈ కథ. కామెడీ హర్రర్ థ్రిల్లర్ నేపధ్యంలో రూపొందింది. కనిష్క్ అద్భుతమైన నాలుగు పాటలు అందించాడు. భరత్‌గారు నిర్మాతగా కాకుండా ఈ సినిమాలో కూడా మంచి పాత్ర చేశారు అన్నారు. నిర్మాత భరత్ మాట్లాడుతూ.. అన్ని రకాల అంశాలు కలగలిపిన ఈ చిత్రం ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు.