కండిషన్స్ అప్లయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలన్నట్టుగా నయనతార నటిగా అనుభవాన్ని
సంపాదించిన కొద్దీ ఒక్కొక్క కండిషన్‌ను నేర్చుకొని మరీ పాటిస్తోంది. ఓ వైపు
ఎక్స్‌పోజింగ్ చేస్తూనే మళ్లీ కాల్షీట్స్ కోసం వెళ్లినవారితో ‘కండిషన్స్ అప్లై’
అంటోందట. ఆ కండిషన్లు ఎప్పటికప్పుడు మారిపోతూనే వుంటాయన్నది వేరే విషయం. గ్లామరస్‌గా కనిపించాలనీ, మాస్ ఆడియన్లకు నచ్చేట్టుగా ఎక్స్‌పోజింగ్ చేయాలని అడిగితే మాత్రం కుదరదంటోంది. తాజాగా ఇటువంటి కండిషన్లు కూడా తనకున్నాయని చెబుతోందట. ఇటీవల ఓ బిగ్‌స్టార్ సరసన ఆమె కాల్షీట్ కోసం వెళితే ఈ కండిషన్లన్నీ ఏకరువు పెట్టిందట. తాను చెప్పిన మాట ఒక్కటి పాటించకపోయినా మళ్లీ వేరే కండిషన్లు ఉంటాయనీ హెచ్చరిస్తోందట. మొత్తానికి నయనతార ముందుగానే ఓ హింట్ ఇస్తూ అనుకున్నది సాధిస్తోంది కండిషన్లతోనే!