పాలిటిక్స్‌కు దూరంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవిత నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పాదయాత్ర ఘట్టంతో సినిమాకు శ్రీకారం చుట్టాడు దర్శకుడు మహి వి రాఘవ. అంతకుముందు ఆనందోబ్రహ్మ అంటూ ఓ కామెడీ హారర్‌తో ప్రశంసలు అందుకున్న దర్శకుడు -వైఎస్ జీవితం ఆసక్తిగా అనిపించటంతోనే సినిమా చేసానంటున్నాడు. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా ఫిబ్రవరి 8న విడుదల కానున్న నేపథ్యంలో మీడియాతో దర్శకుడు
మహి వి రాఘవ ముచ్చట్లు.
ఆసక్తి కలిగించింది:
ఒక వ్యక్తి జీవితాన్ని చదివేసి అవగాహన చేసుకుని సినిమాగా మలిచి అద్భుతంగా ప్రెజెంట్‌చేసే స్థాయి నాకు రాలేదు. కానీ దేశంలో ఒక రాజకీయ నేత గురించి ఎవరిని అడిగినా పాజిటివ్ రెస్పాన్స్ రావడమనేది మామూలు విషయం కాదు. వైఎస్సాఆర్ విషయంలో అదే విన్నాను. ఆయన హీరోయిజం గురించి ఎవ్వరూ మాట్లాడరు. మామూలు విషయాలే మాట్లాడతారు. పిల్లల చదువుకోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి పడిన తపన ఇవే విన్నాను. దాన్నిబట్టి ఆయన ఒక సామాన్యుడికి ఎంత దగ్గరయ్యాడన్నది అర్ధమైంది. అందుకే ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను టచ్ చేయాలనుకున్నా.
రాజకీయ కోణంలో..
‘యాత్ర’ కేవలం వైఎస్ ‘పాదయాత్ర’ చుట్టూ తిరిగే కథ. ఆయన పాదయాత్రకు పురిగొల్పిన సంఘటనలు, జనానికి ఆయన చేసిన పనులు, పాదయాత్ర అనుభవాలు, ప్రజల ఎమోషనల్ సీక్వెన్స్‌లు మాత్రమే ఉంటాయి. కాంట్రవర్సీ ఎలిమెంట్స్. రాజకీయంగానీ చిత్రంలో ఉండదు.
అందుకే మమ్ముట్టి..
పాత్రకోసం నా మొదటి ప్రాధాన్యత మమ్ముట్టి. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత అనుభవమున్న నటుడో అందరికీ తెలుసు. గతంలో ఆయన చేసిన కొన్ని బయోపిక్స్ ఆ పాత్రలకు మరింత లైఫ్ తెచ్చాయి. అలాంటి వాటిలో అంబేడ్కర్ ఒక్కటి చాలు. అందుకే కథ అనుకున్న దగ్గర్నుంచీ మమ్ముట్టి తప్ప మరొకరిని ఆలోచించలేదు. పైగా సినిమాలో ఎక్కడా వైఎస్‌ని ఇమ్మిటేట్ చేసే ప్రయత్నం చేయలేదు. మీరు ట్రైలర్ గమనిస్తే వందశాతం యాక్టర్‌గా మమ్ముట్టి చరిష్మా చూస్తారు. కథ మాత్రం వైఎస్‌దే.
నేనే ఎందుకని అడిగారు..
సినిమా కోసం మమ్ముట్టిని సంప్రదించినప్పుడు ఆయన ఒకే ఒక ప్రశ్న వేశారు. ‘నేనే ఎందుకు...?’ అని. దానికి నేనిచ్చిన సమాధానం ‘దళపతి’ సినిమా. ఆ సినిమాలోని ఒక సీన్‌లో రజినీకాంత్‌లాంటి బిగ్గెస్ట్ స్టార్ అగ్రెసివ్‌గా డైలాగ్స్ చెప్పాక చివరిలో మమ్ముట్టి ‘కుదరదు’ అంటారు. ఆ ఒక్క మాట ఆ సీన్‌ని నెక్స్ట్ లెవెల్‌లో నిలబెట్టింది. అలా జరిగిందంటే కేవలం మమ్ముట్టి. సాధారణ నటులకు అది పాసిబుల్ కాదు. అలాంటివి ఎన్నో చెప్పొచ్చు. సినిమాలో డైలాగులు, సీన్లు మాత్రమే కాదు. ‘యాత్ర’లాంటి సినిమాలో ఒక వ్యక్తి నడిచి వెళ్తుంటేనే లీడర్ అనే ఫీల్ జెనెరేట్ అవ్వాలి. అందుకే మమ్ముట్టి తప్ప మరో ఆప్షన్ కనిపించలేదు.
పెద్దగా టెన్షన్ లేదు..
గతంలో హర్రర్ సినిమా చేసినా.. ఇప్పుడు బయోపిక్ చేసిన ఏ సినిమా నేపథ్యం దానిదే. అయినా నాకు పెద్దగా కష్టమనిపించలేదు. అద్భుతమైన టీమ్ పనిచేసింది. చాలామంది మధ్య షూటింగ్ చేయాల్సి వచ్చినా, నా టీమ్ సపోర్ట్‌తో అవలీలగా అనుకున్నట్టుగా కంప్లీట్ చేయగలిగాం.
రాజకీయాలు ఉండవు..
ఇది వైఎస్ పాదయాత్ర నేపథ్యంలో మాత్రమే చేసిన సినిమా. ఇందులో వైఎస్‌ని హీరోగా నిలబెట్టడానికి ఆయన ప్రత్యర్థుల పాత్రలను పెట్టలేదు. హీరోగా ప్రెజెంట్ చేయడానికి నాకు ఇంకొకరిని చిన్నగా చూపించాల్సిన అవసరం రాలేదు. ఈ సినిమాలో చంద్రబాబు, జగన్‌ల పాత్రలేవీ ఉండవు. కేవంల వైఎస్ పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గరనుండి, పూర్తయ్యే వరకూ సినిమా సాగుతుంది.
జగన్‌కు చూపించా..
సినిమా ఫస్ట్‌లుక్, టీజర్‌ని జగన్‌కు చూపించాము. ఆయన అప్పుడు పాదయాత్రలో ఉన్నారు. టైటిల్ ఫస్ట్‌లుక్ చూసి బాగుందన్నారు. మీ నాయకుడి సినిమా చేస్తున్నారు ప్రొసీడ్ అని చెప్పారు.
తదుపరి చిత్రాలు..
ఇప్పుడు నా ఫోకస్ మొత్తం ఈ సినిమాపైనే ఉంది. ఒక రూపాయి పెట్టామంటే మళ్లీ వెనక్కి ఎంత రాబట్టుకోగలిగాం అనేదాన్ని బట్టే నెక్స్ట్ సినిమా స్థాయి ఉంటుంది. నెక్స్ట్ సినిమా గురించి తరువాత ఆలోచిస్తా.

-శ్రీనివాస్ ఆర్ రావ్