శృతిలో పడినట్టే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శృతిహాసన్ కెరీర్ మొదటినుంచీ ప్రత్యక బ్రాండ్ కోసం ప్రయత్నించింది. నటిగానే కాదు, సంగీత దర్శకురాలిగా, గాయనిగానూ ప్రతిభ చూపిస్తోంది. భారత్ సహా ప్రపంచ దేశాల్లో సంగీత కచేరీలతో ఇమేజ్ తెచ్చుకుంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన లండన్ ట్రవ్‌బడూర్ ప్రాంగణంలో సంగీత కచేరి చేయాలన్న శృతిహాసన్ కలనూ సాకారం చేసుకుంది. ట్రవ్‌బడూర్ షోతో చాలా హ్యాపీగా ఉన్నానంటూనే, ఇప్పటివరకు 100కు పైగా కచేరీలు ఇచ్చినట్టు చెప్పుకొచ్చింది. గత ఏడాది అమెరికాలోని న్యూయార్క్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ది ఇండియన్ డే పేరేడ్‌లో సంగీత కచేరి చేసి మెప్పించటం శృతికే సాధ్యమైందేమో. ఒకవైపు హీరోయిన్‌గా నటిస్తూనే మరోవైపు మ్యూజిక్ బ్యాండ్‌తో మల్టీ ట్యాలెంటెడ్‌గా గుర్తింపు దక్కించుకుంది శృతి ప్రస్తుతం హిందీలో రెండు ప్రాజెక్టులు చేస్తుందట. తమిళంలో త్వరలో ఒక చిత్రాన్ని చేయబోతుంది. మంచి కథలతో మరోసారి పిలిస్తే తెలుగులోనూ మరోసారి విజృంభించాలని చూస్తోందట. అదే జరిగితే, పెద్ద హీరోలకు మల్టీ టాలెంటెడ్ హీరోయన్ మళ్లీ అందుబాటులోకి వచ్చినట్టే.