వైట్లతో అఖిల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని అఖిల్ మూడో ప్రయత్నంలోనూ ఆశించిన సక్సెస్ అందుకోలేక పోయాడు. మొదటి సినిమాతో డిజాస్టర్ అందుకున్న అఖిల్, రెండో చిత్రం ‘హలో’తో ఫర్వాలేదనిపించాడు. కానీ కెరీర్‌కు మాత్రం హలో ఉపయోగపడలేదు. ఇక ముచ్చటగా మూడో చిత్రం మిస్టర్ మజ్ను యావరేజ్ దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు అఖిల్ నాల్గవ సినిమా ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల వరుస పరాజయాలతో బాగా వెనకపడిన డైరెక్టర్ శ్రీను వైట్ల, అఖిల్ కోసం స్టోరీని సిద్ధం చేస్తున్నాడట. అంతేకాదు ఇటీవల శ్రీను వైట్ల, అఖిల్‌తో సినిమా ఉంటుందని కూడా చెప్పాడు. దాంతో అఖిల్ తన తదుపరి చిత్రాన్ని శ్రీను వైట్ల దర్శకత్వంలో చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుందట. మరి శ్రీనువైట్లతో సినిమాకి నాగార్జున ఒప్పుకుంటాడో? లేదో? చూడాలి.