ఆ ఇద్దరిమధ్య 18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తిక్, భాను జంటగా ఎస్.ఆర్.పి. విజువల్స్ పతాకంపై నానిఆచార్య థర్శకత్వంలో శివరాజ్‌పాటిల్ రూపొందిస్తున్న ఇద్దరిమధ్య 18 సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో మంగళవారం ఉదయం ప్రారంభమైంది. పూజా కార్యక్రమాన్ని సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వహించగా, తొలి సన్నివేశంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్‌నివ్వగా, శివరాజ్‌పాటిల్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి మానేపల్లి హనుమంతరావు గౌరవ దర్శకత్వం వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు నాని ఆచార్య మాట్లాడుతూ, యువతకు ఎలాంటి కథ అయితే నచ్చుతుందో, అలాంటి కథే ఈ చిత్రం కోసం రాసుకున్నామని, యూత్‌తోపాటు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సింగిల్ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని పూర్తిచేస్తామని తెలిపారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో యూత్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమా రూపొందిస్తున్నామని, క్యూట్ లవ్‌స్టోరీగా సాగే ఈ చిత్రంలో మొత్తం ఐదు పాటలతో సహా ఒక బీట్ సాంగ్ కూడా వుంటుందని, యువతకు ఓ సందేశమిచ్చేలా రూపొందిస్తున్నామని నిర్మా త శివరాజ్‌పాటిల్ తెలిపారు. కార్యక్రమంలో కథానాయకుడు కార్తీక్, భాను, నటుడు ఆజాద్ తదితరులు చిత్ర విశేషాలను తెలిపారు. దువ్వాసి మోహన్, మేల్కొటె, రచ్చరవి, రాఘవ, అప్పారావు, గీతాసింగ్, చిట్టిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:కె.ఎమ్.క్రిష్, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం:ఘంటాడి, నిర్మాత:శివరాజ్‌పాటిల్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నాని ఆచార్య.