మరిన్ని థియేటర్లలో యమ్6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధ్రువ, అశ్విని, శ్రావణి హీరో హీరోయిన్లుగా జైరామ్‌వర్మ దర్శకత్వంలో విశ్వనాథ్ తన్నీరు నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ -యమ్6. ఫిబ్రవరి 8న విడుదలైన చిత్రానికి మంచి టాక్ రావడంతో తెలంగాణ, ఏపీలో మరికొన్ని థియేటర్లు పెంచుతున్నట్టు నిర్మాత తన్నీరు వెల్లడించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ‘యమ్6ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. కథ, కథనాలు అందరినీ ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. అదే సమయంలో మంచి కామెడీ కూడా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ చిత్రంద్వారా అప్పలరాజు అనే కొత్త కమెడియన్‌ను పరిచయం చేశాం. యమ్6ను విడుదల చేసేందుకు కర్నాటకలోకి డిస్ట్రిబ్యూటర్లు సైతం ముందుకొస్తున్నారు. సో, అక్కడా చిత్రాన్ని విడుదల చేయనున్నాం. హారర్ కామెడీతోపాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన యమ్6ను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అన్నారు.