17న టిఎస్సార్ అవార్డుల వేడుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళాకారులకు జాతీయ స్థాయిలో ఫిల్మ్ అవార్డులు ఇవ్వాలని పదేళ్లక్రితం నాకో ఆలోచన వచ్చింది. టీవీ 9తో కలిసి టిఎస్‌ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ని స్థాపించాం అని కళాబంధు, అవార్డు చైర్మన్ టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. 2017, 2018 సంవత్సరాలకు టిఎస్‌ఆర్ టీవీ 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌కి ఎంపికైన వివరాలను గురువారం సుబ్బరామిరెడ్డి ప్రకటించారు.
ఈ సందర్భంగా టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ- ఈ అవార్డుల ఫంక్షన్‌ని ఈనెల 17న విశాఖపట్నంలోని పోర్ట్ స్టేడియంలో నిర్వహిస్తున్నాం. తెలుగు, హిందీ, పంజాబీ, భోజ్‌పురి, తమిళ్, కన్నడ, మలయాళం-ఇలా భారతదేశంలోని అన్ని భాషల నటీనటులకు అవార్డులు ఇస్తున్నాం. 2017 సంవత్సరానికిగాను ఉత్తమ నటుడిగా బాలకృష్ణ (గౌతమీపుత్ర శాతకర్ణి), 2018 సంవత్సరానికిగాను నాగార్జున (దేవదాస్) ఈ పురస్కారాలను అందుకోబోతున్నారు. నాలుగేళ్ళుగా ఈ పురస్కారాల్ని అందిస్తున్నాం. ఈ ఆదివారం విశాఖపట్నంలో పురస్కారాల్ని ప్రదానం చేస్తున్నాం. శ్రీదేవి, దాసరి నారాయణరావు పేరిట కూడా అవార్డుల్ని ఇస్తున్నాం. ఈ అవార్డుల జ్యూరీ మెంబర్లుగా నగ్మా, జీవితా రాజశేఖర్, మీనా, పరుచూరి గోపాలకృష్ణ, కె.ఎస్.రామారావు, నరేశ్, రఘురామ కృష్ణంరాజు, పింకీ రెడ్డి, శోభన కామినేని వ్యవహరించారు. అన్ని భాషలనుంచి దాదాపు 60మంది స్టార్లు అవార్డులు తీసుకోనున్నారు.
జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికైన నటి నగ్మా మాట్లాడుతూ- నా లైఫ్ ఇంకా చాలా వుంది. ఇంకా చాలా సినిమాలు చేయాలి. అప్పుడే మీరు లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు ప్రకటించారు. ఈ అవార్డుతోపాటు సామాజక సేవ చేసినందుకు మార్చిలో రాజీవ్‌గాంధీ అవార్డు కూడా అందుకోబోతున్నా. తెలుగులో నా సినీ ప్రయాణం ఇంకా కొనసాగాలి అన్నారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ- అందరికంటే కష్టమైన పని ఏంటంటే, జ్యూరీ సభ్యునిగా ఉండటం. కళాకారుల్ని గౌరవించడం సుబ్బరామిరెడ్డిగారిని చూసి నేర్చుకోవాలన్నారు.
విజేతలు: 2018కి ఉత్తమ కథానాయకుడిగా రామ్‌చరణ్ (రంగస్థలం), ఉత్తమ నటి కీర్తి సురేష్ (మహానటి), ఉత్తమ కథానాయిక పూజా హెగ్డే (అరవింద సమేత వీర రాఘవ), 2017కి ఉత్తమ నటి రకుల్ ప్రీత్‌సింగ్ (రారండోయ్ వేడుక చూద్దాం), ఉత్తమ కథానాయిక రాశీఖన్నా (జైలవకుశ) ఎంపికయ్యారు. షాలినీపాండే, రాజేంద్రప్రసాద్, వివి వినాయక్, క్రిష్, సుకుమార్, రాజశేఖర్, అఖిల్, నాగచైతన్య, కల్యాణ్‌రామ్, సుమంత్, ఆది పినిశెట్టి, దేవిశ్రీ ప్రసాద్, తమన్, కల్యాణ్‌దేవ్, అలీ, బి.జయ, బోనీకపూర్‌లకు పలు విభాగాల్లో అవార్డులు దక్కాయి. శ్రీదేవి స్మారక పురస్కారం విద్యాబాలన్‌కి, దాసరి స్మారక పురస్కారం మోహన్‌బాబుకి లభించింది. ఔట్‌స్టాండింగ్ సినీ లిరిక్ రైటర్ అవార్డుని సిరివెనె్నల సీతారామశాస్ర్తీకి ప్రకటించారు.