శ్రీశ్రీ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణ, విజయనిర్మల ప్రధాన తారాగణంగా ఎస్.బి.ఎస్. ప్రొడక్షన్స్ పతాకంపై ముప్పలనేని శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం శ్రీశ్రీ. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి తొలి కాపీ సిద్ధం చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, హీరో కృష్ణ స్వర్ణోత్సవ చిత్రంగా రూపొందించిన ఈ చిత్రం సరికొత్తగా వుంటుందని, అన్ని పనులు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశామని, త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని, అదేవిధంగా సుధీర్‌బాబు ఓ కీలకమైన పాత్రలో నటించారని, మహేష్‌బాబు వాయిస్ ఓవర్ చిత్రానికి హైలెట్‌గా నిలవనుందని వారు తెలిపారు. నరేష్, సాయికుమార్, పోసాని, ఎల్.బి.శ్రీరాం, తోటపల్లి మధు, దేవదాస్ కనకాల, మురళీశర్మ, కునాల్ కౌశిక, అనితాచౌదరి, సోఫియా తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు:రామ్ కంకిపాటి, సంగీతం:ఇ.ఎస్.మూర్తి, కెమెరా:సతీష్ ముత్యాల, ఎడిటింగ్:రమేష్, నిర్మాతలు:సాయిదీప్ చాట్ల, వై.బాలురెడ్డి, షేక్ షిరాజ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ముప్పలనేని శివ.