కళాతపస్వి ప్రశంసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకరాభరణం, సాగరసంగమం వంటి అద్భుత సంగీత భరిత చిత్రాలను అందించిన కళాతపస్వి కె విశ్వనాథ్ రాజీవ్‌మీనన్ రూపొందించిన ‘సర్వం తాళమయం’ చిత్రాన్ని చూసి, ‘చాలాకాలం తర్వాత ఒక గొప్ప సంగీత భరిత చిత్రాన్ని చూశాను. రాజీవ్‌మీనన్ ఈ చిత్రాన్ని చాలాబాగా తీశారు. ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని రూపొందించి, ఒక మంచి సందేశాన్నికూడా అందించిన రాజీవ్‌మీనన్‌కి నా ఆశీర్వాదాలు’ అని అభినందించి ఆప్యాయంగా కొగిలించుకున్నారు. అలాగే ప్రముఖ దర్శకులు చంద్రశేఖర్ యేలేటి, మహానటి దర్శకులు నాగఅశ్విన్, యాత్ర దర్శకులు మహి వీ రాఘవ్ ఈ చిత్రాన్ని చూసి రాజీవ్‌మీనన్‌ని ఎంతగానో ప్రశంసించారు. ఏ ఆర్ రహమాన్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం.
మార్చి 8న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రం అన్ని మల్టీఫ్లెక్స్ థియేటర్లలోనూ విడుదల చేస్తున్నట్టు దర్శక నిర్మాత రాజీవ్ మీనన్ చెప్పారు. జి.వి.ప్రకాష్, అపర్ణ బాలమురళి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నేడుముడి వేణు, వినీత్, దివ్య దర్శిని ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.