ఒకవేళ నిజమైతే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానటి బయోపిక్ విజయం ఒకరకమైన స్ఫూర్తినిస్తే, ఎన్టీఆర్ బయోపిక్ ఫలితాలు మాత్రం జాగ్రత్త అంటూ హెచ్చరించాయి. ఎంత గొప్ప నటుల కథలైనా ఎంత పెద్ద స్టార్లు నటించినా స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తపడకుండా కేవలం హంగులకు ప్రాధాన్యమిస్తే ప్రేక్షకులు ఎంత దారుణంగా తిరస్కరిస్తారో బాక్సాఫీస్ సాక్షిగా రుజువైంది. అందుకే ఇకపై ఎవరి బయోపిక్ తీయాలన్నా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోక తప్పదు. మహానటిని చూసేశాం కనుక, శ్రీదేవి జీవితం కూడా వెండితెరపై వస్తే బాగుండు అనుకుంటున్న ప్రేక్షకులు కోట్లలో వున్నారు. బోనీకపూర్ ఆ ప్రయత్నాల్లో ఉన్నట్టు టాక్ కూడా వచ్చింది. ఒకవేళ అది కార్యాచరణలోకి వస్తే వెంటనే తాను రంగంలోకి దూకుతానంటోంది మిల్కీబ్యూటీ తమన్నా. ఇటీవలే ఓ ప్రైవేటు కార్యక్రమంలో ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన తమన్నా మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా ఎవరైనా శ్రీదేవి బయోపిక్ తీస్తున్నారని తెలిస్తే వెంటనే వెతికి పట్టుకుని నాకో వేషమిమ్మని అడుగుతానని, తానెంతో అభిమానించే నటి కథ తెరకెక్కుతున్నపుడు అందులో భాగం కావాలనుకోవడం తప్పేమీ కాదని స్పష్టం చేసింది. చాలాకాలంనుంచి ఫాంలో లేక ఇబ్బంది పడుతున్న తమన్నాకు ఎఫ్2 బ్లాక్‌బస్టర్ సక్సెస్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ఇదే ఏడాది సైరా కూడా వస్తుండటంతో ఆమె ఆనందం మామూలుగా లేదు.