ముహూర్తం ఫిక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మూడో చిత్రం తెరకెక్కనుందని తెలిసిందే. ఈ చిత్రం మార్చి 28న లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. అయితే షూటింగ్ మాత్రం ఎన్నికల తరువాత స్టార్ట్ కానుంది. టీడీపీ తరఫున బాలయ్య ప్రచారం చేయనున్నారు. అందుకే షూటింగ్ ఆలస్యంగా ప్రారంభంకానుంది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ తన సొంత బ్యానర్ ఎన్‌బికె ఫిలిమ్స్ నిర్మించనుంది. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చి సింహ, లెజెండ్ భారీ విజయాలు సాధించడంతో ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు వున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్‌తో బాలయ్య, వినయ విధేయ రామతో బోయపాటి డిజాస్టర్‌లను చవిచూశారు. ఈ కొత్తచిత్రంతో వీరిద్దరూ హిట్టు అందుకుంటారేమో చూద్దాం.