15న మనసా వాచా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తేజస్, కరిష్మా కర్పాల్, సీమా పర్మార్ హీరో హీరోయిన్లుగా ఎంవి ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం -మనసా వాచా. నిశ్చల్ దేవా, లండన్ గణేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్న ప్రేమ కథా చిత్రమిది. ఎంజిఎం (మినిమమ్ గ్యారెంటీ మూవీస్) ద్వారా మార్చి 15న థియేటర్లకు వస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత నిశ్చల్ దేవ్ మాట్లాడుతూ ‘మనసా వాచా చిత్రాన్ని దర్శకుడు ఎంవి ప్రసాద్ ప్రాణం పెట్టి చేశాడు. సినిమా మొత్తం లండన్‌లోనే తీశాం’ అన్నారు. దర్శకుడు ఎంవి ప్రసాద్ మాట్లాడుతూ క్యాన్సర్‌ను జయించాలనే లక్ష్యంతో జర్నీ చేస్తున్న ప్రేమికులకు ఎదురయ్యే కొన్ని అనూహ్య సంఘటనల సమాహారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు చెప్పారు. ఈ చిత్రం సాధించే లాభాల్లో సగం మొత్తాన్ని క్యాన్సన్‌కు ఉచితంగా వైద్యం అందిస్తున్న సంస్థలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఎంజిఎం అధినేత బుచ్చిబాబు మాట్లాడుతూ సినిమా బాగా వచ్చిందని, ఎంజిఎం ద్వారా విడుదల చేస్తుండటం హ్యాపీగా ఉందన్నారు. మార్చి 15న వీలైనన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు.