అశ్వద్ధామగా కళ్యాణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటాస్‌తో మళ్లీ లాంగ్ గ్యాప్‌లో ఫామ్‌లోకి వచ్చిన కళ్యాణ్‌రామ్‌కు, తరువాత చేసిన షేర్, నానువ్వే లాంటి చిత్రాలు మళ్లీ ప్లాప్‌లనే తెచ్చాయి. దాంతో కాస్త కొత్తగా చేయాలన్న ఆలోచనతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్‌ను దర్శకుడుగా పరిచయం చేస్తూ 118 చేశాడు. ఆ సినిమాతో కళ్యాణ్‌రామ్ మంచి హిట్టందుకున్నాడు. దీంతో కొత్త కథలపై కల్యాణ్ దృష్టిపెట్టాడు. తన తదుపరి చిత్రాన్ని కొత్త దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చేయనున్నాడు. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందే చిత్రానికి ‘అశ్వత్థామ’ టైటిల్ని నిర్ణయించారట. కథ కొత్తగా ఉండటంతో కళ్యాణ్ ఈ దర్శకుడికి ఓకే చెప్పాడు. త్వరలోనే వివరాలు వెల్లడి కానున్నాయి.