క్రేజీ టైటిల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాను ఎలా మార్కెట్ చేయాలో రాజవౌళికి రీల్‌తో పెట్టిన విద్య. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్నతో ఆ సినిమాకు కోట్లకు పడగలెత్తించాడు. జక్కన్న తరువాతి ప్రాజెక్టు ఎన్టీఆర్- రామ్‌చరణ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతుండటం తెలిసిందే. ట్రిపుల్ ఆర్ వర్కింగ్ టైటిల్‌తో సంచలనం రేపిన ఈ చిత్రానికి -టైటిల్ ఛాయిస్ ఆడియన్స్‌కే వదిలేశాడు. సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. సినిమాకు ఏం పేరు పెట్టాలన్నదే ఇప్పుడు పెద్ద సమస్య. ఇంకేముంది, ఛాయిస్ మీదే అనగానే ఫ్యాన్స్ తమదైన శైలిలో రెచ్చిపోయి పేర్లు పెడుతున్నారు.
వీటిలో కొన్ని ఆసక్తికరంగా ఉండటంతో వాటిని జక్కన్న పరిశీలిస్తున్నాడట. రఘుపతి రాఘవ రాజారాం, రం రం రుథిరం, రామ రావణ రాజ్యం, రౌద్ర రణ రంగం.. ఇలా ఎన్నో పేర్లు పరిశీలనకు వచ్చాయని తెలుస్తోంది. ఈ టైటిల్స్‌కే జక్కన్న కనెక్టవుతాడో, అనూహ్యమైన టైటిల్‌ను తెరపైకి తెస్తాడో వేచి చూడాలి.