చూసేవాళ్లకోసమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రత్తాలుగా పేరు తెచ్చుకున్న గ్లామర్ భామ లక్ష్మీరాయ్ ఈమధ్యే ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. తాజాగా నీయా-2 అనే తమిళ చిత్రంలో నటిస్తున్న లక్ష్మీ, ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించి షాకిచ్చింది. సోషల్ మీడియాలో లక్ష్మీరాయ్ తరచూ బికినీ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. బీచ్‌లో, ఇతర అందమైన లొకేషన్లలో వీలైనంతగా అందాలను ధారపోస్తూ నెటిజనులకు హీటెక్కించటం లక్ష్మీ స్టయిల్. ఈ బికినీ ఫొటోల గురించి ప్రశ్నిస్తే ‘నేనెక్కడికెళ్లినా మెమొరీగా ఉంటుందని సెల్ఫీలు తీసుకుంటా. ఈమధ్య ముంబైలో ఉంటున్నా. అక్కడ బికినీ చాలా కామన్. నేను పోస్టు చేసింది ఆ ఫొటోలే. అవి పబ్లిసిటీ కోసం కాదు. నన్ను బికినీలో చూడటం ఇష్టం లేకపోతే కళ్లు మూసుకోవచ్చు’ అంటూ గట్టిగా పంచ్ ఇచ్చింది. లవ్ అఫైర్ల కథనాల సంగతేమిటి? అన్న ప్రశ్నకు ‘నా జీవితంలో జరిగిన విషయాలను నేను దాచిపెట్టను. అలాగని పబ్లిక్‌గా చెప్పుకోను. నేను చాలామందితో రిలేషన్‌లో వున్నమాట నిజమే’ అంటూ మరో పంచ్ వేసింది. అంతేకాదు, వాటి గురించి చెప్పాలంటే టైం సరిపోదంటూ ముక్తాయింపు షాక్ ఇచ్చిందట కూడా.