షకీలా ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు దశాబ్దాల క్రితం సౌత్‌లో షకీలా క్రేజ్ ఎలాంటిదంటే -ఆమె సినిమా విడుదలకు స్టార్ హీరోల సినిమాలూ సైడిచ్చేసేవి. అలాంటి ఇమేజ్ తెచ్చుకున్న షకీలా జీవిత కథతో బయోపిక్ నిర్మితమవుతోన్న విషయం తెలిసిందే. సంచలన తార కనుక షకీలా బయోపిక్ ప్రకటించిన దగ్గర్నుంచీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘డర్టీ పిక్చర్’తో స్మిత కథను చెప్పినట్టే... ‘షకీలా’ జీవితాన్నీ ఈ సినిమా ఆడియన్స్‌కి అందివ్వడం ఖాయం. షకీలా పాత్రను బాలీవుడ్ నటి రిచా చద్దా చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోస్‌తో ఆమె అందరి దృష్టినీ ఆకర్షించింది కూడా. రిచా చద్దా మెయిన్ స్ట్రీమ్ బాలీవుడ్ సినిమాల్లో నటించినా, దాదాపు అన్నీ ఆఫ్ బీట్‌లోనే ఉంటాయన్నది జగద్విధితం. ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ 1, 2’, ‘్ఫక్రే’, ‘సరబ్జీత్’.. లాంటివన్నీ చద్దా చిత్రాలే. అంతేకాదు ఇతర బాలీవుడ్ బ్యూటీల మాదిరిగా ఊరికే గ్లామర్ ఒకలబోసే రకంకాదు. అవసరమైనప్పుడు హాట్‌గా కనిపించీ అందరి మతులూ పోగొట్టిన సందర్భాలూ తక్కువేం కాదు. విద్యాబాలన్‌కు ‘డర్టీపిక్చర్’తో పెద్ద క్రేజ్ వచ్చి స్టార్ అయిపోయింది. ‘షకీలా’ సినిమాతో సీన్ రిపీటై, రిచాకు బ్రేక్ వస్తుందేమో చూడాలి.