ఎవరెస్టుపైకి జాకీచాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్షల్ ఆర్ట్స్ స్టార్‌గా ప్రపంచ ఖ్యాతి తెచ్చుకున్న జాకీచాన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ ఉండదు. ఆమధ్య ఓ బాలీవుడ్ సినిమాలో నటించిన చాన్, ప్రపంచంలోనే అత్యంత ఎతె్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే సాహసం చేయబోతున్నాడట. అదీ ఓ సినిమా కోసం. 1960లో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన చైనా సాహసికుల బృందం వాంగ్ ఫుజు, గొన్పొ, కుయిన్హుల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. క్లైంబర్స్ పేరిట రూపొందుతున్న చిత్రంలో జాకీచాన్‌తోపాటు మరో చైనీస్ అగ్రనటుడు వుజింగ్, యువనటుడు జింగ్ బొరాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హాంకాంగ్ దర్శకుడు డేనియల్ లీ తెరకెక్కిస్తున్న సినిమా ప్రస్తుతం చైనాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.