జయలలితగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయలలిత పాత్రలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తోంది. కంగన పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ విషయాన్ని ప్రకటించింది. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం తమిళంలో ‘తలైవి’గా, హిందీలో ‘జయ’గా ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రముఖ తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం గురించి విజయ్ మాట్లాడుతూ ‘దేశంలోని ప్రముఖ రాజకీయ నేతల్లో జయలలిత ఒకరు. ఇప్పుడు ఆమె జీవితాన్ని తెరకెక్కిస్తున్నామంటే మాపై ఎంతో బాధ్యత ఉంది. అందుకే ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దేశం గర్వించే నటి కంగనారనౌత్ ఇందులో నటించడం ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నాడు. ‘ఈ శతాబ్దపు విజయవంతమైన మహిళల్లో జయలలిత ఒకరు. రాజకీయంలో ఆమె ఓ ఐకాన్. ఆమె జీవితం సినిమా కథకు చక్కగా సరిపోతుంది. ఆమె పాత్రలో నటిస్తుండటం ఎంతో గౌరవంగా భావిస్తున్నా’ అంటూ కంగనా వ్యాఖ్యానించింది. విజయేంద్రప్రసాద్ అందిస్తున్న ఈ కథకు విష్ణువర్థన్ ఇందూరి నిర్మాత.