‘అక్షర’ పాటకు మంచి స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరం అంగడి సరుకైంది.. విద్య వ్యాపారమైంది అని.. ఇది తప్పని ఎవరికివారు భావిస్తుంటారే తప్ప ఎవరూ మార్పును గురించి ఆలోచించారు. కానీ అమ్మకపు సరుకుగా మారిన కార్పొరేట్ విద్యా విధానం మారాలంటూ.. వ్యాపారంగా మారిన అక్షరానికి ఆలంబనగా మారిందో యువతి. వివేకాన్ని ఇవ్వాల్సిన విద్య వ్యాపారంగా మారితే ఆ వ్యవస్థ ఎంత దారుణంగా మారుతుందనేది అందరికీ తెలుసు. తెలిసి ఉదాసీనంగా ఉండేవారిని సైతం ప్రశ్నిస్తూ ఒక యువతి సాగించిన పోరాట నేపథ్యంలో వస్తోన్న సినిమా ‘అక్షర’. లేటెస్టుగా చిత్రంనుంచి లిరికల్ సాంగ్ విడుదల చేశారు. అక్షర సినిమా థీమ్‌ను తెలియజేసేలా చైతన్యప్రసాద్ రాసిన పాటలోని ప్రతి అక్షరం ఓ అగ్నికణం అనిపిస్తోంది. ‘అసులదర.. నిశలు చెదర.. అక్షరాగ్ని శిఖలు ఎగసి ఆగ్రహించెలె.. సమరమిప్పుడే సమయమిప్పుడే కలంకూడా కత్తి దూసి కదం తొక్కెలె’ అంటూ సాగే పాట ఈ ఏడాదికే ది బెస్ట్ సాంగ్‌గా నిలవనుందన్న టాక్ వస్తోంది. మొత్తంగా ఈ పాటతో సినిమాస్థాయి ఏంటో తెలిసిపోతుంది. నందిత శే్వత టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రంలో స్య, మధునందన్, షకలక శంకర్, శ్రీతేజ, అజయ్ తదితరులు నటిస్తున్నారు.