రాణిగారి బంగళాలో పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనంద్ నంద, రష్మీగౌతమ్ జంటగా బాలాజీ నాగలింగం సమర్పణలో వి సినీ స్టూడియోస్ పతాకంపై డి.దివాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాణాగారి బంగళా. ఈ సినిమాలోని పాటలు శనివారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రముఖ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మంచి కథతో ఈ హారర్ సినిమా చేశానని, ట్రైలర్స్‌బాగున్నాయని, దివాకర్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించినట్టు కనిపిస్తోందన్నారు. తప్పకుండా ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని అన్నారు. నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ, ఈ సినిమా హిట్ అయి, ఆనంద్ స్టార్ హీరోగా మారాలి అన్నారు. దర్శకుడు దివాకర్ మాట్లాడుతూ, ఈ కథకు ఈ టైటిల్ యాప్ట్ అవుతుందని పెట్టామని, సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తిచేశామని, మ్యూజిక్, ఫొటోగ్రఫీ హైలెట్‌గా నిలుస్తాయని, అన్నిరకాల కమర్షియల్ అంశాలున్న చిత్రమిది అన్నారు. ఆనంద్ మాట్లాడుతూ, చిన్నప్పటినుంచి హీరోకావాలనే ప్యాషన్‌తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. ఈ కార్యక్రమంలో సంపూర్ణేష్‌బాబు, రామసత్యనారాయణ, సి.కళ్యాణ్, ఆర్.పి.పట్నాయక్, ఆలీ, తరుణ్ పాల్గొన్నారు.