12న వస్తున్న ‘లూసిఫర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనతాగ్యారేజ్, మనమంతా, మన్యంపులి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. మలయాళంలో ఘన విజయం సాధించిన సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 12న విడుదల చేస్తోంది. తాజాగా విడుదల చేసిన సినిమా తెలుగు ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఆసక్తికరంగా సాగిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్, టివినో థామస్, సానియా ఐయప్పన్, సాయికుమార్, నీల ఉషా, కళాభవన్ షాజోన్ నటించిన సినిమాకి మలయాళ అగ్రనటుడు, కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. దీపక్‌దేవ్ సంగీతం సమకూర్చగా సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.