బాలీవుడ్‌లోకి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మిల్క్భీమ తమన్నా తాజా గా ఊపిరి సినిమా విజయంతో జోరుమీదుం ది. ఇప్పటికే బాహుబలి సినిమాతో అంతర్జాతీయంగా ఖ్యాతితెచ్చుకున్న ఈమెకు ఇప్పుడు క్రేజ్ బాగా పెరిగిపోయింది. తమిళ, తెలుగు భాషల్లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఈ భామ ఈమధ్య బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అక్కడ సక్సెస్‌రేట్ అంతంత మాత్రంగానే ఉండడంతో సౌత్ పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. తాజాగా మరోసారి బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసింది. రోహిత్‌శెట్టి దర్శకత్వంలో తెరకెక్కే తదుపరి చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోందట. గత ఏడాది షారుఖ్‌తో రోహిత్‌శెట్టి తీసిన దిల్‌వాలే చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూడడంతో ఈసారి హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. రణవీర్‌సింగ్ హీరోగా నటించే ఈ చిత్రంలో తమన్నా ఎంపికైందట. ప్రస్తుతం తమన్నా తమిళ్‌లో దర్మదురై, తెలుగులో అభినేత్రి, బాహుబలి-2 చిత్రాలు చేస్తోంది. బాలీవుడ్‌లో చేసే చిత్రం వచ్చేనెలలో మొదలుకానుందట. ఈసారి ఎలాగైనా బాలీవుడ్‌లో మంచి హిట్ కొట్టేయాలనే ప్లాన్‌లో వుంది మిల్క్భీమ!