ఫీల్‌గుడ్ 96..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా కొత్త సినిమా షూటింగ్ మొదలైంది. విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన దిల్‌రాజు నిర్మాణంలో ఉగాది సందర్భంగా హైదరాబాద్‌లో ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రానికి సి ప్రేమ్‌కుమార్ దర్శకుడు. తమిళంలో విజయవంతమైన ‘96’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్‌గా తెరకెక్కనుంది. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ‘మా బ్యానర్లో ఎన్నో ఫీల్‌గుడ్ ప్రేమకథలు రూపొందించాం. ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చిన సంగతీ తెలిసిందే. అదే కోవలో మరో ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నాం అన్నారు. తమిళంలో విజయవంతమైన ‘96’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌గా రూపొందిస్తున్నట్టు చెప్పారు. శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లు. తమిళంలో సినిమాను డైరెక్ట్ చేసిన సి ప్రేమ్‌కుమార్ తెలుగులోనూ దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈనెల రెండోవారంలో చిత్రీకరణ మొదలవుతుంది. ముందు 15 రోజులపాటు కెన్యాలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తామన్నారు. తర్వాత హైదరాబాద్, వైజాగ్ ప్రాంతాల్లో జూలైనాటికి చిత్రీకరణ పూర్తిచేస్తాం’ అన్నారు.