తొలిప్రేమ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త నటుడు ఉదయ్, ట్వింకిల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా రాజేష్ సిహెచ్ దర్శకత్వంలో బంగార్రాజు నిర్మిస్తోన్న క్యూట్ లవ్‌స్టోరీ -గుర్తుకొస్తున్నాయి. హైదరాబాద్ శ్రీ సత్యసాయి నిగమాగమంలో సోమవారం హీరో హీరోయిన్లపై ముహూర్తపు సన్నివేశం చిత్రీకరించారు. నిర్మాత సాయివెంకట్ క్లాప్‌నివ్వగా శ్రీనివాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా హీరో ఉదయ్ మాట్లాడుతూ సినిమాలో స్కూల్ బోయ్‌గా నటిస్తున్నానని, టీనేజ్‌లో జరిగే సింపుల్ అండ్ బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ ఇదన్నారు. హీరోయిన్ ట్వింక్విల్ అగర్వాల్ మాట్లాడుతూ సినిమాలో నటిస్తున్నందుకు ఎగ్జైటింగ్‌గా ఉందన్నారు. దర్శకుడు రాజేష్ సిహెచ్ మాట్లాడుతూ 1980 గ్రామీణ నేపథ్యంలో జరిగే లవ్‌స్టోరీ ఇది. స్కూల్ డేస్‌లో పిల్లలు ఎలా ఉండేవారు, ఆ పిల్లలమధ్య ప్రేమ ఎలా చిగురించేదన్న అంశాలను చిత్రంలో చూపిస్తున్నామన్నారు. నిర్మాత బంగార్రాజు మాట్లాడుతూ సినిమా చేయాలన్న ఆలోచన చాలాకాలంగా ఉందని, ఆ టైంలో రాజేష్ చెప్పిన కథ నచ్చి అడుగు ముందుకేశామన్నారు. పల్లెటూరి వాతావరణంలో జరిగే స్వచ్ఛమైన ప్రేమ కథను మే 1నుంచి రెగ్యులర్ షూటింగ్‌తో తెరకెక్కిస్తామన్నారు.