దటీజ్ ఆదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య సినిమాల విషయంలో ట్రెండ్ మారింది. ఫక్తు కమర్షియల్ ఫార్ములాను పక్కనపెట్టి కొత్త ఐడియాలతో కుర్ర దర్శకులు చెలరేగుతున్నారు. ఇక బాలీవుడ్ ఇలాంటి ప్రయోగాలకు ఎప్పుడూ ముందుంటుంది. ఈమధ్యే లెస్బియన్ లవ్‌లో సోనమ్‌కపూర్, రెజినా కనిపించి ‘ఏక్ లడికి కో దేఖతో ఐసా లగా’ అంటూ దుమారం రేపారు. తాజాగా అలాంటి ప్రయత్నమే చేస్తోంది మరో హాట్ భామ ఆదాశర్మ? లింగమార్పిడి కథతోసాగే ఓ లవ్‌స్టోరీలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మాన్ టూ మాన్ టైటిల్‌తో తెరకెక్కే సినిమాకి అభిర్ దర్శకుడు. ఓ అబ్బాయి లింగమార్పిడితో అమ్మాయి అవుతాడు. ఈ విషయం తెలీని హీరో ఆ అమ్మాయిని పెళ్లాడతాడు. తరువాత విషయం తెలియడంతో ఏం చేశాడు, సమస్యను ఎలా పరిష్కరిచుకున్నాడన్నది కథ. లింగమార్పిడి చేయించుకున్న వారిని సమాజం ఎలా చులకనగా చూస్తుంది అన్న పాయింట్‌ను సినిమాలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. నవీన్ కస్తూరియా హీరోగా, ఆదాశర్మ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. 1920 హర్రర్ సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆదాశర్మ అక్కడ కమాండో 2, కమాండో 3 లాంటి సినిమాల్లో నటించి క్రేజ్ తెచ్చుకుంది. ఇక తెలుగులో నితిన్ సరసన హార్ట్‌ఎటాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ పలు చిత్రాల్లో నటించింది. అయితే ఇక్కడ పరాజయాలు వరుసగా రావడంతో ఈ బ్యూటీ మళ్లీ బాలీవుడ్‌లోనే ప్రయత్నాలు చేస్తుంది. మరి ‘మాన్ టూ మాన్’ సినిమాతో ఆదా ఎలాంటి సంచలనం రేపుతుందో చూడాలి.