‘ఏదైనా జరగొచ్చు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు శివాజీరాజా తనయుడు విజయ్‌రాజా హీరోగా పరిచయవౌతున్న చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. వెట్‌బ్రెయిన్ ఎంటర్‌టైన్‌మెంట్, సుధర్మ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె.రమాకాంత్ దర్శకుడు. పూజా సోలంకి, సోషాసింగ్ హీరోయిన్లు. ఈ సినిమా టీజర్‌ను డైరెక్టర్ వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘శివాజీరాజా తనయుడు విజయ్‌రాజా హీరోగా పరిశ్రమలో స్టార్‌గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు’ అన్నారు. శివాజీరాజా మాట్లాడుతూ ‘వినాయక్ చేతులమీదుగా టీజర్ విడుదలవడం ఆనందంగా ఉంది. ‘ఏదైనా జరగొచ్చు’ అంటూ వస్తున్న మా అబ్బాయి విజయ్‌రాజాను ఆశీర్వదించండి’ అన్నారు. దర్శకుడు రమాకాంత్ మాట్లాడుతూ ఇదొక క్రైమ్ హారర్ థ్రిల్లర్. మంచి టీం కుదిరింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు మంచి సపోర్ట్ ఇస్తున్నారు అన్నారు.