కొత్తసినిమా ఎప్పుడో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య రవితేజ కెరీర్ బాగా డల్ అయినట్టు కనిపిస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘కిక్-2’ భారీ పరాజయాన్ని చవిచూడడంతో ఆ తరువాత గట్టి నమ్మకంతో చేసిన ‘బెంగాల్ టైగర్’ ఫర్వాలేదనిపించుకున్నప్పటికీ రవితేజ తన తదుపరి చిత్రంపై ఇప్పటివరకు ఎలాంటి వివరాలు తెలియజేయడంలేదు. ‘బెంగాల్ టైగర్’ సినిమా హిట్ అయినాకూడా వసూళ్లపరంగా అంతగా రాబట్టుకోలేకపోయింది. ఈ సినిమా విడుదల విడుదలై ఆరు నెలలు గడుస్తున్నా కూడా ఆయన తదుపరి చిత్రం ఏదీ సెట్స్‌పైకి వెళ్లలేదు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించాలనుకున్న ‘ఎవడో ఒకడు’ సినిమా రవితేజ చేయనని చెప్పడంతో ఆ ప్రాజెక్టు పక్కకు వెళ్లింది. చక్రి అనే నూతన దర్శకుడు దర్శకత్వంలో ‘రాబిన్‌హుడ్’ చిత్రం ఉంటుందని ప్రకటించినా కూడా అది ఇంకా సెట్స్‌పైకి రాలేదు. మొత్తానికి రెమ్యూనరేషన్ విషయంలో రవితేజ పట్టుపట్టడమే దీనికి కారణమని తెలుస్తోంది. మొత్తానికి రెండు మూడు సినిమాలు ఆయనకోసం వెయిట్ చేస్తున్నాయి. మరి రెమ్యూనరేషన్ కోసం గిరిగీసుకొని కూర్చుంటాడో లేదంటే సినిమాలకోసం దిగివస్తాడో చూడాలి!