అర్జున్.. వెనక్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలా గ్యాప్ తరువాత నిఖిల్ హీరోగా చేసిన అర్జున్ సురవరం మరోసారి వాయిదాపడింది. వాస్తవానికి మే1న సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే 26న హాలీవుడ్ సినిమా ‘అవెంజర్స్ -ఎండ్ గేమ్’ భారీఎత్తున విడుదల అవుతుండటంతో, డిస్ట్రిబ్యూటర్లు సినిమా విడుదలను వాయిదా వేయాలని కోరారు. డిస్ట్రిబ్యూటర్ల రిక్వెస్ట్ మేరకు సినిమా విడుదలను వాయిదా వేసినట్టు మేకర్స్ ప్రకటించారు. సినిమా వాయిదాతో నిఖిల్ నిరాశకు గురయ్యాడు. సినిమా కోసం ఇప్పటికే యాక్టివ్‌గా నిఖిల్ ప్రమోషన్ చేస్తున్నాడు. సినిమా వాయిదాపడిన విషయం బాధపెట్టినా డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయాన్ని గౌరవిస్తానని నిఖిల్ ప్రకటించాడు. ఇదిలావుంటే, మే 9న మహేశ్‌బాబు ‘మహర్షి’ సినిమా విడుదలవుతుంది. ఇటు అవెంజర్స్, అటు మహర్షి భారీ చిత్రాలు ఉండటంతో -అర్జున్ సురవరం చిత్రం మే మూడోవారానికిగాని విడుదల కాకపోవచ్చన్న అంచనాలు ఫిల్మ్‌నగర్ నుంచి వినిపిస్తున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ ప్రకటించారు.