పీటీ కత్రిన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో సక్సెస్‌కాని బయోపిక్‌ల సంఖ్య బహు తక్కువ. అందుకే అక్కడ -బయోపిక్‌ల ట్రెండ్ మరింత ముదురుతోంది. ప్రముఖ అథ్లెట్ పీటీ ఉష జీవిత కథతో బయోపిక్‌ను తెరకెక్కించేందుకు సీనియర్ నటి, దర్శకురాలు రేవతి సీరియస్‌గా ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. మేరీకోమ్ కంటే ముందే ఈ కథను రెడీ చేసి ప్రియాంకను సంప్రదించిందట. ప్రియాంకే నా ఆప్షన్ అంటూ రేవతి ఓ ఇంటర్వ్యూలోనూ రివీల్ చేసింది. తర్వాత పీసీ కోసం ఏళ్లకేళ్లు ఎదురు చూసినా, పలుమార్లు కథా చర్చలు జరిపినా ప్రాజెక్టు మాత్రం సెట్స్‌కు వెళ్లలేదు. పీసి పూర్తిగా హాలీవుడ్ ఆఫర్లతో విదేశీ షూటింగ్‌ల్లో బిజీ అయిపోయింది. ఇప్పటి వరకూ ఎదరు చూసిన రేవతి విసిగిపోయి, పీసీ ప్లేస్‌లో కత్రినను రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తోందట. ఇప్పటికే రెండుసార్లు కత్రినకు కథను నేరేట్ చేసినట్టు వినికిడి. ఇటీవలే బెంగుళూరు నుంచి ముంబయివెళ్లి కత్రినాను కలిసి ఫైనల్ స్క్రిప్ట్ వినిపించారని అంటున్నారు. స్క్రిప్టు బావుంది, సెట్స్‌కెళ్దామంటూ కత్రిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. రన్నింగ్ ట్రాక్‌పై విగరస్ ప్రాక్టీస్ చేస్తేనే అథ్లెట్ పాత్రలోకి పరకాయం చేసే వీలుంటుంది. అథ్లెట్‌గా మారాలంటే బబ్లీగావుండే బ్యూటీకి కాస్త కష్టమే!నంటూ విశే్లషిస్తున్నారు. పైగా నవతరం నాయికలు నిరంతర కసరత్తులతో అథ్లెటిక్ లుక్‌లో తళుక్కుమంటుంటే, రేవతి తన ఆప్షన్‌గా కత్రినానే ఎందుకు ఎంచుకున్నట్టు? అన్న సందేహాలూ వ్యక్తం చేస్తున్నారు. కేరళకు చెందిన పిటి ఉషను ఏ జనరేషన్‌కూ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని అథ్లెట్. క్రేజీ ప్రాజెక్టుకు స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్‌ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకోవడం మరింత ఆసక్తిని పెంచుతోంది.