ఏడాదికి మూడు చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త టాలెంట్‌ను వెదికిపట్టడంలో నిర్మాత బెక్కెం వేణుగోపాల్ శైలి వేరు. దాదాపు అంతా కొత్త దర్శకులతో సినిమాలు నిర్మిస్తూ వరుస విజయాలు అందుకున్న ఆయన లక్కీమీడియా బ్యానర్‌పై తన విజయపరంపర కొనసాగిస్తున్నాడు. మరోవైపు సోలో నిర్మాతగానే కాకుండా ప్రముఖ నిర్మాత దిల్‌రాజుతో కలిసి నిర్మాతగానూ సినిమాలు తీస్తున్నాడు. నేడు పుట్టినరోజు సందర్భంగా బెక్కెం వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. ‘నేను జెమినీ టీవిలో ప్రొడక్షన్ అసిస్టెంట్, ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేశా. హీరో శివాజీ అప్పటినుండి నాకు మంచి మిత్రుడు. మేమిద్దరం కలిసి లక్కీమీడియా బ్యానర్‌ని మొదలుపెట్టాం. శివాజీ నిర్మాతగా టాటా బిర్లా మధ్యలో లైలా సినిమాతో మా సినిమా ప్రయాణం మొదలైంది. ఇప్పటివరకు తొమ్మిది చిత్రాలు నిర్మించాం. అందులో ఒక్కటితప్ప అన్నీ హిట్లే. సూపర్ హిట్స్‌గా క్రేజ్ తెచ్చుకున్నాయి. నాకు దిల్‌రాజు, రామానాయుడులు స్ఫూర్తి. నా సినిమాలు నచ్చడంతో దిల్‌రాజు నాతో కలిసి ‘నేను లోకల్’ నిర్మించాడు. అప్పటినుండి మా ఇద్దరి అసోసియేషన్‌లో సినిమాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా రాజ్‌తరుణ్‌తో ఓ సినిమా మొదలుపెట్టాం. ఇక మా లక్కీమీడియా బ్యానర్‌పై ఏడాదికి మూడు సినిమాలు నిర్మించాలన్న ఆలోచనతో ఉన్నాం. అయితే కొన్నిసార్లు వేరే సినిమాల బిజీవల్ల కుదరడం లేదు. కానీ ఇకపై ఏడాదికి మూడు సినిమాలు నిర్మిస్తాం. త్వరలోనే రెండు సినిమాలు ప్రకటిస్తాను. ఇప్పటికే రెండు కథలు సిద్ధమయ్యాయి. ప్రీప్రొడక్షన్ పనులూ జరుగుతున్నాయి. అందులో ఒకటి అద్భుతమైన కథతో ఉంటుంది. అలాగే రెండో సినిమా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉంటుంది. ఒక సినిమాకు కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. మరో సినిమాకు సీనియర్ దర్శకుడు పనిచేస్తాడు. అయితే ఓ ప్రముఖ హీరోతో సినిమా చేయాలన్న ప్రయత్నంలో ఉన్నాం. ఆ హీరో ఓకే అనగానే సినిమా మొదలుపెడతాం. కొత్త దర్శకులను పరిచయం చేయడం ఆనందంగా ఉంది. ఎందుకంటే వారు తరువాత ప్రముఖ దర్శకులుగా పేరు తెచ్చుకోవడం ఎవరికైనా ఆనందమే కదా అంటూ ముగించారు.