పనిలోనే ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరంతరం పని ఉంటేనే తాను సరదాగా, ఫ్రెష్‌గా, ఆరోగ్యంగా ఉంటాననీ పనిలేకపోతే చాలా అలసిపోయినట్లు ఉంటుందని చెబుతోంది అందాల నటి రకుల్‌ప్రీత్‌సింగ్. నీరసంగా గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవడం తనకు సుతారామూ ఇష్టం ఉండదనీ, అలా ఉంటే చిరాకుగా ఉంటుందని అంటోంది.
అందరూ నిరంతరం పనిలోనే గడుపుతావు, అలుపురాదా అని అడుగుతారనీ అసలు పనిలేకపోతేనే అలుపు వస్తుందనీ చెబుతోంది. ఆమె గూర్చి తెలిసినవాళ్లు మాత్రం రకుల్ ఎనర్జీలెవల్స్ బాగా ఉంటాయనీ, అలసినట్లు కనిపించకపోవడం ఆవిడ గొప్పతనమని చెబుతున్నారు. నటన అంటే నాకు ఎంతో ఇష్టం. అలా ఇష్టమైన పనిచేస్తుంటే బోర్‌గానీ, అలుపుగానీ తెలియవని అంటోంది రకుల్. నిజమే ఆమె చెప్పినట్టు పనిలోనే పరమాత్మను వెదుక్కుంటే ఇక ఎదురేముంది?!