అదరగొట్టారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హౌలీ హౌలీ -అంటూ రెచ్చిపోయి చిందులేశారు అజయ్ దేవన్‌గన్, రకుల్, టబు. అదీ ‘దే దే ప్యార్ దే’ సినిమా కోసం. అకీవ్ అలీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలోని థర్డ్ సాంగ్ శుక్రవారం బయటికొచ్చింది. పార్టీ సాంగ్‌లో రకుల్, టబు, అజయ్‌లు స్టెప్పులేయడం ఆకట్టుకుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వస్తున్న చిత్రంపై ఎన్నో అంచనాలున్నాయి. భార్య మంజు (టబు)నుంచి వేరుపడి ఒంటరిగా ఉంటున్న 50 ఏళ్ల ఆశిష్ (అజయ్)కు పాతికేళ్ల ఆయేషా (రకుల్‌ప్రీత్) పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. అలా ఆమెను జీవితంలోకి ఆహ్వానిద్దామన్న ఆలోచన వచ్చేసరికి, విడిపోయిన మంజు మళ్లీ ఆశీష్ లైఫ్‌లోకి వస్తుంది. అటు మాజీ భార్య, ఇటు ప్రేయసి -మధ్య ఆశీష్ ఎలా ఇరుకున్నాడన్నదే ‘దే దే ప్యార్ దే’ కథ. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని రొమాంటిక్ కామెడీగా దర్శకుడు అకీవ్ తెరకెక్కించాడు. మే 17న థియేటర్లకు వస్తున్న చిత్రం కోసం బాలీవుడ్ అభిమానులు ఆతృతతో ఎదురు చూస్తున్నారు.